Addam News
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 3:14 am Posted by : Addam News

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ సేవ ప‌క్వాడ్ కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌హిళా మోర్చా ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని వినయ్ కుమార్ హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనలో భారత దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఈ స్వచ్చ భారత్ కార్యక్రమం ద్వారా ఎవరి పరిసర ప్రాంతాలను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం వ‌ల్ల మన దేశం కూడా శుభ్రంగా, శ్రేష్టంగ ఉంటుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింరాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నవీన్, ఆనంద్‌రావు, మహిళా మోర్చా నాయకులు సంధ్యారాణి, మంగమ్మ, పూర్ణిమ, వసంత, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, కుమార్, లక్ష్మణ్‌ యదవ్, హనుమంతు, భరత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png