Addam News
Newspaper Banner
Date of Publish : 06 July 2025, 9:24 am Posted by : Addam News

పార్కుల‌ సుందరీకరణ, అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

పార్కుల‌ సుందరీకరణ, అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కెన‌రా బ్యాంక్ పార్క్‌, సుర‌భి పార్క్‌, టిఆర్‌టి గ్రౌండ్‌లో రూ.25 లక్ష‌ల రూపాయ‌ల నిధుల‌తో చేప‌ట్టిన సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్‌, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్‌తో క‌లిసి శ‌నివారం కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… కెనరా బ్యాంక్ పార్క్‌లో ప్రత్యేకమైన లైటింగ్‌తో ఏర్పాటు చేసిన ఐ లవ్ గాంధీనగర్ అనే బోర్డు ప్రజలను ఎంతో ఆకర్షిస్తుందని తెలిపారు. పార్క్ చుట్టూ ఫెన్సింగ్, వాకర్స్ కొరకు పాత్ వే, పూల మొక్కల ఏర్పాటు వంటి సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో అన్ని పార్కుల్లో చేపట్టిన పనులు పూర్తి చేసుకొని డివిజన్‌లోని పార్కులన్నిటిని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది తప్పకుండా నియోజకవర్గంలోనే గాంధీనగర్ డివిజన్ ను రోల్ మోడల్గా నిలిపేందుకు అభివృద్ధి పనులను జరిపిస్తున్నట్లు కార్పొరేటర్ పావ‌ని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, నాయకులు సాయి కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్‌, స్థానికులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png