అశోక్‌న‌గ‌ర్ నాలాలో పూడిక‌తీత ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, మే 28, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ నాలాలో కొన‌సాగుతున్న పూడిక‌తీత ప‌నుల‌ను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్‌, సిబ్బందితో క‌లిసి గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... రానున్న వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా ద్వారా లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేర‌కుండా నాలాలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మ‌ట్టిని తొల‌గించే ప‌నులు వేగ‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ముంపు బ‌స్తీల్లో వ‌ర‌ద ప్ర‌వాహం రాకుండా...