హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ చేపట్టిన పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ :   నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్ల పై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు రావ‌డంతో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బుధ‌వారం అశోక్‌న‌గ‌ర్ సిటి సెంట్రల్ లైబ్రెరీ లేన్,అశోక్‌న‌గ‌ర్ స్ట్రీట్ నెంబర్ 1, 2 లలో పర్యటించారు. కార్పొరేటర్ పావ‌ని సూచనల మేరకు అశోక్‌న‌గ‌ర్‌లో వరదనీటిని తొలగించేందుకు హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ చేపట్టిన పనులను అధికారులు, బీజేపీ నాయకులతో కలసి ఆమె...