Addam News
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 8:29 pm Posted by : Addam News

మంచినీటి పబ్లిక్ నల్లాను ఏర్పాటు చేయించిన‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ దోభిఘాట‌ల్ బ‌స్తీలో స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌తో చ‌ర్చించి ప‌బ్లిక్ న‌ల్లాను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా దోభిఘాట్ బ‌స్తీవాసులు గురువారం కార్పొరేటర్ పావ‌ని విన‌య్‌కుమార్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… గాంధీనగర్ డివిజన్ దోబిఘాట్ బస్తీలో గత పదిహేను ఏళ్ళ క్రితం తీసివేసిన మంచినీటి పబ్లిక్ నల్లా కనెక్షన్‌ను బ‌స్తీవాసుల విజ్ఞప్తి మేరకు వాటర్ వర్క్స్ అధికారులతో ప‌లుమార్లు చర్చించి తిరిగి నల్లా కనెక్షన్‌ను పునరుద్ధరించి నూతన మంచినీటి సరఫరా కొరకు పబ్లిక్ నల్లాను ఏర్పాటు చేయించామ‌న్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని బ‌స్తీవాసుల‌కు పబ్లిక్ నల్లా ఏర్పాటు చేయించామ‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, సాయి కుమార్, ఆనంద్ రావు, బ‌స్తీవాసులు మల్లికార్జున్, రమేష్, నాగరాజు, పూజిత, శోభ, సురేష్, వరమ్మా, సంజీవ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png