మంచినీటి పబ్లిక్ నల్లాను ఏర్పాటు చేయించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ దోభిఘాటల్ బస్తీలో స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ వాటర్ వర్క్స్ అధికారులతో చర్చించి పబ్లిక్ నల్లాను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా దోభిఘాట్ బస్తీవాసులు గురువారం కార్పొరేటర్ పావని వినయ్‌కుమార్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ... గాంధీనగర్ డివిజన్ దోబిఘాట్ బస్తీలో గత పదిహేను ఏళ్ళ క్రితం తీసివేసిన మంచినీటి పబ్లిక్ నల్లా కనెక్షన్‌ను బస్తీవాసుల విజ్ఞప్తి మేరకు వాటర్ వర్క్స్ అధికారులతో పలుమార్లు...