Addam News
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 4:37 am Posted by : Addam News

హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న కార్పొరేట‌ర్ పావ‌ని

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో శ్రీ హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. అలాగే డివిజ‌న్‌లోని వివి గిరిన‌గ‌ర్ శ్రీ హ‌నుమాన్ దేవాల‌యాల్లో కార్పొరేట‌ర్ పావ‌ని దంపతులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మాచర్ల దేవ‌నాధం, వివేక్‌న‌గ‌ర్ ఆల‌య దేవాలయం రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జానకి సుధాకర్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, పి.నర్సింగ్ రావు, ఆకుల సురేందర్, సురేష్, ఆనంద్ రావు, సాయి తరుణ్, సాయి కృష్ణ యాదవ్, భక్తులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png