Addam News
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 5:44 am Posted by : Addam News

సమస్యలపై జిహెచ్ఎంసి కౌన్సిల్‌లో ప్రభుత్వాన్ని నిలదీసిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, నవంబర్ 25, అద్దం న్యూస్ :   గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించకుండా జిహెచ్ఎంసి అవ‌లంభిస్తున్న సోమ‌రిత‌నం, నిర్ల‌క్ష్య వైఖ‌రి పై కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ మంగ‌ళ‌వారం జ‌రిగిన జిహెచ్ఎంసి కౌన్సిల్ స‌మావేశంలో నిల‌దీశారు. డివిజన్‌లో పారిశుద్ధ్య సమస్య, పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, వెలగని స్ట్రీట్ లైట్స్‌తో అంధకారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేట‌ర్ పావ‌ని వివరించారు. ఎంటమోలజీ వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందని, వారానికి ఒకసారి వచ్చే ఫాగ్ సిబ్బంది విధులకు గైర్హాజరుతో బస్తీలు, కాలనీల ప్రజలు దోమల భారిన పడి విషజ్వరాలు గురవుతున్నారన్నారు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లుగా ప్ర‌జ‌ల‌ సమస్యలు పరిష్కరించే బాధ్య‌త‌ తమతో పాటు ప్రభుత్వానికి ఉంటుందని, పని చేయని అధికారుల పట్ల చర్యలు తీసుకొని, డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ కౌన్సిల్ స‌మావేశంలో తన గళాన్ని వినిపించారు. కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం తరపున మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించిన డివిజన్ల అభివృద్ధి కొరకు 150 డివిజన్లోలో ప్రతి డివిజన్‌కు రూ. 2 కోట్ల నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి ప్రజల సమస్యల ప‌రిష్కారానికి, డివిజన్ అభివృద్ధికి నిధులు ఉపయోగకరంగా ఉండేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో కార్పొరేట‌ర్ పావ‌ని సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png