సమస్యలపై జిహెచ్ఎంసి కౌన్సిల్‌లో ప్రభుత్వాన్ని నిలదీసిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

హైదరాబాద్, నవంబర్ 25, అద్దం న్యూస్ :   గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించకుండా జిహెచ్ఎంసి అవ‌లంభిస్తున్న సోమ‌రిత‌నం, నిర్ల‌క్ష్య వైఖ‌రి పై కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ మంగ‌ళ‌వారం జ‌రిగిన జిహెచ్ఎంసి కౌన్సిల్ స‌మావేశంలో నిల‌దీశారు. డివిజన్‌లో పారిశుద్ధ్య సమస్య, పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, వెలగని స్ట్రీట్ లైట్స్‌తో అంధకారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేట‌ర్ పావ‌ని వివరించారు. ఎంటమోలజీ వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందని, వారానికి ఒకసారి వచ్చే ఫాగ్ సిబ్బంది విధులకు గైర్హాజరుతో బస్తీలు, కాలనీల ప్రజలు దోమల భారిన పడి...