అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ పావని
అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ పావని హైదరాబాద్, డిసెంబర్ 11, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో ఇటీవల రూ.21 లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు బుధవారం అర్థరాత్రి ప్రారంభమయ్యాయి. ఈ పనులను ఆకస్మికంగా స్థానిక గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పర్యవేక్షించారు. అక్కడే ఉన్న జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్‌తో కలిసి కార్పొరేటర్ పావని మాట్లాడారు. అర్ధరాత్రి సమయంలో కాంట్రాక్టర్ తో పాటు ఉండి పనులను జరిపిస్తున్నందుకు...