Addam News
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 12:35 am Posted by : Addam News

వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

చిక్క‌డ‌ప‌ల్లి, న‌వంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం జ‌రిగింది. 72 రోజులకు సంబంధించిన హుండీని లెక్కించారు. ఆల‌య నిర్వహణాధికారి పి.కొమ్మాలు, దేవాదాయ శాక ఇన్‌స్పెక్ట‌ర్ సురేఖ‌, ఆల‌య పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ జాన‌కి సుధాక‌ర్‌, అర్చ‌కులు వేంకటాద్రి, సిబ్బంది సమక్షంలో ఈ హుండీ లెక్కింపు జ‌రిగింది. 2 ల‌క్ష‌ల 84 వేల 251 రూపాయ‌ల ఆదాయం రాగా, ఈ హుండీని లెక్కించ‌గా 17 వేల 456 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింద‌ని ఆల‌య ఈవో కొమ్మాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సిబ్బంది, భ‌క్తులు పాల్గొన్నారు.