సైబర్ నేరాలపై అవగాహన రావాలి – తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 9, అద్దం న్యూస్ : సైబర్ నేరాలపై అవగాహన రావాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని జలవాయు టవర్స్ సెమినార్ హాల్‌లో ఆదివారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిజిపి శివధర్‌రెడ్డి హాజరై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి. సజ్జనార్ అధ్యక్షతన...