సమగ్ర ప్రణాళికలతో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన – మంత్రి పొన్నం ప్రభాకర్
సమగ్ర ప్రణాళికలతో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, జనవరి 2, అద్దం న్యూస్ : హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ నిధులు రూ.6 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి–దోమలగూడ లింక్ బ్రిడ్జ్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,...