అంబర్‌పేట, నవంబర్ 10, ( అద్దం న్యూస్ ) :
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టిపెట్టక పోవడం మరచి ప్రతి వేదికపై కేసీఆర్, కేటీఆర్ పై పసలేని ఆరోపణలు చేయడం పాలన చేతగాని తనానికి నిదర్శనమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ధాత్రిక్ నాగేందర్ బాబ్జీ ద్వజమెత్తారు. నింబోలి అడ్డ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు భీమాగౌని కృష్ణాగౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం జమాల్ బస్తీలో సత్యనారాయణస్వామి వ్రతం ఆచారించారు. అనంతరం నాగేందర్ బాబ్జీ మాట్లాడుతూ… రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. అధికారం చేపట్టి మూడేండ్లు సమీపిస్తున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడా నికి నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు రవి గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ గౌడ్, సత్యేందర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.