ఘనంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ వేడుకలు – ముఖ్య అతిధిగా హాజరైన డిఆర్‌డిఎల్‌ డైరెక్టర్ అంకతి రాజు

తార్నాక, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    సీఎస్ఐఆర్ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తార్నాకలోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ( ఐఐసీటీ ) ఆడిటోరియంలో సోమవారం ఘనంగా జరిగాయి. ‘ ఆత్మనిర్భరత కోసం శాస్త్ర విజ్ఞానం–వికసిత్ భారత్ నిర్మాణానికి పిలుపు ’ అనే అంశంతో నిర్వహించిన కార్యక్రమానికి హైదరాబాద్ డిఆర్‌డిఎల్‌ డైరెక్టర్ డాక్ట‌ర్‌ అంకతి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో...