భ‌వ‌న నిర్మాణ ప‌నులు చేస్తుండ‌గా హైటెన్స‌న్ వైర్లు త‌గిలి కూలి మృతి

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   భ‌వ‌న నిర్మాణం ప‌నులు చేస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తూ 11 కెవి విద్యుత్ తీగ‌ల‌కు త‌గిలి కూలి మృతి చెందిన సంఘ‌ట‌న చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఎస్ఐ.నాగ‌రాజు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి... ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విజ‌య‌న‌గ‌రానికి చెందిన నాయుడు ( 54 ), అత‌ని భార్య లక్ష్మీ పిల్ల‌ల‌తో క‌లిసి హైద‌రాబాద్ ముషీరాబాద్ బాకారంలో నివ‌సిస్తున్నారు.భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లో రోజువారిగా కూలిగా నాయుడు ప‌ని చేస్తుంటాడు. రాంన‌గ‌ర్ డివిజ‌న్ రిసాల‌ఖుర్షీద్ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ...