హైదరాబాద్, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ తొలి హోం, లేబర్ శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి లంబాడి తండాలో జరిగింది. నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లల్లో నాయిని నర్సింహారెడ్డి వర్థంతి కార్యక్రమం జరిగింది. రాంనగర్ చౌరస్తా, కవాడిగూడతో పాటు లంబాడితండా బస్తీల్లో వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ నాయకుడు నాయిని దేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జై సింహా, రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్, కల్వ గోపి, సిరిగిరి కిరణ్, డేగల బిక్షపతి యాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, బల్లెకరి రమేష్, బాలరాజ్ గౌడ్, రాజు గౌడ్, కుమార్ నాయక్, రాకం సత్యనారాయణ, అరుణ్, అమిత్, ఆయాజ్, అద్నాన్, మహేందర్, అరవింద్, జయదేవ్, డాన్సర్ మహేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.