ఘ‌నంగా తెలంగాణ తొలి మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి వ‌ర్థంతి

హైద‌రాబాద్‌, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) :       తెలంగాణ తొలి హోం, లేబర్ శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం న‌గ‌రంలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి లంబాడి తండాలో జ‌రిగింది. నాయిని నరసింహారెడ్డి ఫౌండేషన్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ కార్పొరేట‌ర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు డివిజ‌న్ల‌ల్లో నాయిని న‌ర్సింహారెడ్డి వ‌ర్థంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. రాంన‌గ‌ర్ చౌర‌స్తా, క‌వాడిగూడ‌తో పాటు లంబాడితండా బ‌స్తీల్లో వ‌ర్థంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది....