శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌ర‌స్వ‌తి దేవి రూపంలో అలంక‌ర‌ణ‌

చిక్క‌డ‌ప‌ల్లి,  ( అద్దం న్యూస్ ) :     ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మండ‌పంలో శుక్ర‌వారం అమ్మ‌వారిని శ్రీ స‌ర‌స్వ‌తి దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌లు పెద్ద ఎత్తున హాజ‌రై స‌రస్వ‌తి దేవికి పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌న అధ్య‌క్షుడు, టీడీపీ మాజీ కార్పొరేటర్, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం...