శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా దేవి రూపంలో అలంకరణ
చిక్కడపల్లి, అక్టోబర్ 18, ( అద్దం న్యూస్ ) : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని ఆదివారం శ్రీ దుర్గా దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపన అధ్యక్షుడు, టీడీపీ మాజీ కార్పొరేటర్, టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు పలుస...