ముషీరాబాద్, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో నెలకొల్పిన అమ్మవారిని బుధవారం శ్రీ గాయత్రీ దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా మహానివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, సహస్రనామార్చన, పారాయణం, ఆరగింపు, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.కొమ్మాలు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్, ఆలయ ప్రధాన అర్చకులు బుగ్గా లక్ష్మీపతి శర్మ, అర్చకుడు కందాల వేంకటాద్రి, దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.![]()