శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌హాలక్ష్మీ దేవి రూపంలో అలంక‌ర‌ణ‌

చిక్క‌డ‌ప‌ల్లి, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :    ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మండ‌పంలో బుధ‌వారం అమ్మ‌వారిని శ్రీ మ‌హాల‌క్ష్మీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌న అధ్య‌క్షుడు, టీడీపీ మాజీ కార్పొరేటర్, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు పలుస బాల్‌రాజ్‌ గౌడ్, శ్రీ నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్...