బాల‌కృష్ణ‌కు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించడం హ‌ర్ష‌ణీయం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :   సినీ న‌టుడు బాల‌కృష్ణ‌కు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రకటించడం హ‌ర్ష‌ణీయమ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా పేద రోగులకు, క్యాన్సర్ పీడితులకు చికిత్స నిర్వహిస్తూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఎంతో అభివృద్ది చేసి దేశంలోనే గొప్ప ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఘనుడు నందమూరి బాలకృష్ణ అని...