పూడికతీత పనులను వెంటనే చేపట్టాలి – కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్
అంబర్‌పేట్, మే 26, అద్దం న్యూస్ : వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నాలా పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అంబర్‌పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సంబంధిత అధికారులు, స్థానిక బస్తి ప్రజలతో కలిసి అంబర్‌పేట్ డివిజన్ బాపూనగర్‌లో నాలా పరివాహక ప్రాంతంలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు నాలా పూడికతీత పనులు చేపట్టాలన్నారు. బాపూనగర్ నాలాలో పేరుకుపోయిన వ్యర్ధాలను తక్షణమే తీసివేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ దుర్గ,...