రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు
– ఎమ్మెల్యే డాక్టర్.ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్
గాంధీనగర్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్.ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ లు అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ వద్ద రూ.5 లక్షలతో నిర్మించనున్న షెడ్డు పనులకు శనివారం వారిద్దరు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లల్లో ప్రజా సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తామన్నారు. పేద ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను మంజూరు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముచ్చకుర్తి ప్రభాకర్, బీజేపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, పావని, వినయ్ కుమార్, నాయకులు రమేష్ రామ్, ఉమేష్, బస్తీవాసుడు శ్రీనివాస్ యాదవ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply