అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి – అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
కాచిగూడ, మే 26, అద్దం న్యూస్ : నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాచిగూడ డివిజన్ లో రహమత్‌బాగ్‌లో సుమారు 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు పనులను కాచిగూడ కార్పొరేటర్ కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ... నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యలను...