శ్రీ భవాని శంకర దేవాలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
భోలక్పూర్, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరం ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ డివిజన్లో 400 ఏళ్ల చరిత్ర ఉన్న దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరుగనున్న మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె.రాజేష్...