వివేక్నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
గాంధీనగర్, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో నెలకొల్పిన అమ్మవారి మండపంలో ఆదివారం దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం జరిగింది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి...