వక్ఫ్ భూములకు రక్షణ కల్పించాలని ధర్నా
వక్ఫ్ భూములకు రక్షణ కల్పించాలని ధర్నా హైదరాబాద్, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) : జామియా నిజామియా–రాయిదుర్గ్ వక్ఫ్ భూములను పరిరక్షించి, ఆక్రమణలు, అక్రమ బదలాయింపులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ జామియా నిజామియా–రాయిదుర్గ్ వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ వక్ఫ్ బచావ్ తహ్రీక్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహాబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు, మత పెద్దలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు....