బిఆర్ఎస్ పార్టీలో బ‌య‌ట‌ప‌డ్డ విభేదాలు – ఫ్లెక్సీ ఏర్పాటులో దుర్భాషలాడుకున్న నాయ‌కులు – ఎమ్మెల్యే ముఠా గోపాల్ స‌మ‌క్షంలోనే ఒక‌రి పై ఒక‌రు దూషించుకున్న నాయ‌కులు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 1, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీలో మ‌రోసారి విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శంక‌ర్ ముదిరాజ్‌, మాజీ అధ్య‌క్షుడు మోజ‌స్ లు ఇద్ద‌రు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ స‌మ‌క్షంలోనే దుర్భాషలాడుతున్నారు. రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శంక‌ర్ ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శంక‌ర్ ముదిరాజ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై మాజీ అధ్య‌క్షుడు మోజ‌స్...