Addam News
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:09 am Posted by : Addam News

నిరుద్యోగుల‌కు తెలంగాణ సంపూర్ణ చ‌రిత్ర పుస్త‌కాల పంపిణీ

ముషీరాబాద్‌, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) :     హెచ్ఎంటివి స్టాఫ్ రిపోర్ట‌ర్ దేవాపూజా శ్రీకాంత్ స్వయంగా రాసిన తెలంగాణ సంపూర్ణ చరిత్ర పుస్తకాల‌ను నిరుద్యోగ విద్యార్థులకు ఉచితంగా పంపిణి కార్య‌క్ర‌మం సోమవారం జ‌రిగింది. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి వరంగల్‌-న‌ల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పరికిరాల నరేష్, నిరుద్యోగ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా లైబ్రరీలో ఉండే నిరుద్యోగుల‌కు ఉచితంగా పుస్తకాలు ఇచ్చినందుకు దేవాపూజా శ్రీకాంత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. నిరుద్యోగులందరు ఎంతో కష్టపడి రాసిన ఈ సంపూర్ణ తెలంగాణ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసారు.

ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ… విద్య ఒక్క గొప్పతనని నిరుద్యోగుల‌కు తెలియజేస్తూ కాలం చాలా విలువ అయినదన్నారు. అందరు సమయాన్ని మంచిగా ఉప‌యోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాలో ఉండాలని నిరుద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు వేణు, ప్రశాంత్, బాలు, శ్రీను, ఉపేందర్, అనిల్, స్వప్న, మమత, మాధురి తదితరులు పాల్గొన్నారు.