నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్‌ల పంపిణి
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థినులకు నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్‌ల పంపిణి కార్యక్రమం బుధవారం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నాయిని నరసింహ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్‌లను అందచేశారు. పదవ తరగతి పరీక్షలు రాయనున్న 58 విద్యార్థినులకు శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియచేశారు. నాయిని నరసింహ రెడ్డి ఫౌండేషన్ ఆద్వర్యంలో...