Addam News
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 11:40 pm Posted by : Addam News

పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ

చిక్క‌డ‌ప‌ల్లి, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :      హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మిషన్ టిజిపిఎస్‌సి ఇండియన్ హిస్టరీ పుస్తకాలను నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిరుద్యోగ జేఏసీ నేత, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి నరేష్ హాజ‌రై మాట్లాడారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ… పుస్తకాలు అవసరం ఉందని గుర్తిస్తూ అడగగానే పుస్తకాలను పంపిణీ చేయడానికి ముందుకొచ్చిన మిషన్ టీజీపీఎస్‌సి అనిల్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగులు రాబోయే నోటిఫికేషన్లలో మంచి కొలువులు సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, కుమార్, సవాయ్ సింగ్, నరసింహ రాథోడ్, సురేష్ యాదవ్, రవి యాదవ్, రాంబాబు, వీర స్వామి, వేణు, రమేష్ ,మమత, అనిత, బిందు, లత, మౌనిక, శ్రీను తదితరులు పాల్గొన్నారు.