చిక్కడపల్లి, నవంబర్ 17, ( అద్దం న్యూస్ ) :
పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో మంగళవారం ఉమ్మడి నల్లగొండ -ఖమ్మం -వరంగల్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి పరికరాల నరేష్ ఆధ్వర్యంలో సందీప్ పబ్లికేషన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ను అభ్యర్థులకు ఉచిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి చిలకూరి అఖిలేష్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్ ల చేతుల మీదగా పంపిణీ చేశారు. ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అన్ని పోటీ పరీక్షల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేష్ పేర్కొన్నారు.
ఇంగ్లీష్ సబ్జెక్టును నిర్లక్ష్యం చెయ్యొద్దని, ఉద్యోగం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. లైబ్రరీ చైర్మెన్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యం దిశగా నిరంతరం సాధన చేయాలని చేయాలన్నారు. జర్నలిస్టు అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి చిలకలూరి అఖిలేష్ మాట్లాడుతూ… అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను నరేష్ అందించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేష్ మాట్లాడుతూ… తాను అడిగిన వెంటనే ఈ పుస్తకాలను అందజేసిన సందీప్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు చరణ్, వేణు, నరసింహ రాథోడ్, ప్రశాంత్, కుమార్ రాథోడ్, రవి నాయక్, రామకృష్ణ, శ్రీకాంత్, సంధ్య, భార్గవి, బిందు, రజీయా బేగం, పవిత్ర, అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.