Addam News
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 12:33 am Posted by : Addam News

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

ముషీరాబాద్, అక్టోబర్ 7, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివి.గిరి నగర్‌లో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది . బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మహిళల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదన్నారు. ఇంట్లో మహిళ ఆర్థికంగా నిలదొక్కుకుంటే, ఆ కుటుంబం బాగుపడుతుంది.. ఆ కుటుంబం బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దృఢమైన నమ్మకంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయికీర్తి, అభిషేక్ కెన్నెడీ, సురేష్ కుమార్ యాదవ్, బాబురావు, మోహన్, నరేందర్ యాదవ్, భాస్కర్ రెడ్డి, టింకు, సుబ్బారావు, సత్తి, నర్సింగ్ ముధిరాజ్, సాయిరాం పాల్గొన్నారు.