వైవిధ్యమైన ఆహారంతో కీళ్ల వాతానికి ముప్పు తక్కువ – ఐసిఎంఆర్-ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి
తార్నాక, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) : వైవిధ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ( కీళ్ల వాతం ) వచ్చే అవకాశాలు తక్కువగా ఉండవచ్చని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ( ఎన్ఐఎన్ ), హైదరాబాద్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్కు చెందిన 18–55 ఏళ్ల 615 మందిపై నిర్వహించిన పరిశోధనలో కీళ్ల వాతం ఉన్నవారితో పోలిస్తే ఆరోగ్యవంతుల ఆహారంలో వైవిధ్యం, సూక్ష్మ పోషకాల లభ్యత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కీళ్ల వాతం...