ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో ఘ‌నంగా దీపావ‌లి వేడుక‌లు

క‌వాడిగూడ‌, న‌వంబ‌ర్ 7, ( అద్దం న్యూస్ ) : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడలోని ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ లో శ‌నివారం ఘ‌నంగా దీపావ‌ళి వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హాజ‌రై స్కూల్ బాల‌, బాలిక‌ల‌తో క‌లిసి ట‌పాసులు కాల్చి సంబ‌రాల‌ను జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటామ‌న్నారు. మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపడమే ఈ పండుగ అంతరార్థం...