Addam News
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 3:01 pm Posted by : Addam News

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా దీపావ‌ళి వేడుక‌లు

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ న‌గ‌రంలో వాడ వాడ‌ల్లో దీపావ‌ళి పండుగ ఘ‌నంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా దీపావళి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఒకచోటికి చేరి సంతోషోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని గాంధీన‌గ‌ర్‌లో మాచ‌ర్ల గోవింద‌రావు నివాసంలో దీపావ‌ళి వేడుక‌లను కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా లక్ష్మీదేవి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ధనలక్ష్మి ఆశీస్సులు పొందారు. కుటుంబ సభ్యులంతా కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.