ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా దీపావ‌ళి వేడుక‌లు

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) : హైద‌రాబాద్ న‌గ‌రంలో వాడ వాడ‌ల్లో దీపావ‌ళి పండుగ ఘ‌నంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా దీపావళి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఒకచోటికి చేరి సంతోషోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని గాంధీన‌గ‌ర్‌లో మాచ‌ర్ల గోవింద‌రావు నివాసంలో దీపావ‌ళి వేడుక‌లను కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా లక్ష్మీదేవి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ధనలక్ష్మి ఆశీస్సులు పొందారు. కుటుంబ సభ్యులంతా కలిసి పూజల్లో...