రైలు ఢీకొని డాక్టర్ మృతి

  అంబ‌ర్‌పేట్‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :    సంపర్క్‌ క్రాంతి రైలు ఢీకొని ఓ డాక్టర్ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేష‌న్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్ట‌ర్ ఎల్లప్ప, హెడ్ కానిస్టేబుల్ చిమ్నా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చంచల్ గూడ ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ అలీ కుమార్తె అలీషా (26) వృత్తిరీత్యా డాక్టర్. శుక్రవారం విధుల నిమిత్తం కాచిగూడకు రావడానికి మలక్‌పేట్ రైల్వేస్టేష‌న్ రెండో ప్లాట్ ఫామ్ నుంచి ఒకటవ ప్లాట్ ఫారానికి రావడానికి పట్టాలు దాటుతుండగా...