తెల్ల వెంట్రుక పీకితే మిగతా జుట్టు తెల్లబడుతుందా? నిజం ఏంటి?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మన జుట్టు మన అందాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తుంది. అందుకే ఎంతోమంది నల్లగా, మెరిసే జుట్టును కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే వయస్సు పెరిగేకొద్దీ లేదా ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషక లోపాల వంటివి కారణంగా కొంతమంది చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. ఈ సందర్భాల్లో “ఒక్క తెల్ల వెంట్రుక పీకితే మిగతావీ తెల్లబడతాయి” అనే మాట తరచుగా వింటాం. అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉంది? అనేది తెలుసుకుందాం.. అపోహకు శాస్త్రీయ...