Addam News
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 10:48 am Posted by : Addam News

పాఠశాల వేడుకలు.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో తెలుగు మీడియం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ జ్యోతిని వెలిగించి వార్షికోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఎర్రబాలెంలోని డాన్ బాస్కో పాఠశాల విద్యార్థులకు తెలుగు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తూ స్థానికంగా మంచి గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png