రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి •రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్
రాంనగర్, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) : రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ అన్నారు. సేవా సంకల్ప అభయాన్లో భాగంగా బిజెవైఎం సభ్యుడు రాజ్ కిరణ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్ వైట్ హౌస్ హోటల్ వద్ద జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానవాళికి సేవ చేసేందుకు, అవసరంలో ఉన్నవారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు మనమంతా ఏకమవుదామన్నారు....