Addam News
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:10 am Posted by : Addam News

ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయొద్దు – దీప‌క్ జాన్‌, అర‌వింద్ కుమార యాద‌వ్‌

హైద‌రాబాద్‌, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ ( మైనారిటీస్ ) ఫైనాన్స్ కార్పొరేషన్ దీపక్‌ జాన్‌, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్‌ కుమార్‌ యాదవ్ లు సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్‌లోని లంబాడి తండా బస్తీ కమ్యూనిటీ హాల్‌లో డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవీన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ ( మైనారిటీస్ ) ఫైనాన్స్ కార్పొరేషన్ దీపక్‌ జాన్‌, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్‌ కుమార్‌ యాదవ్ లు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

శిబిరంలో స్థానికులకు జనరల్‌ చెకప్‌, రక్త పరీక్షలు, దంత పరీక్షలు, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వైద్యులు ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు తగిన సూచనలు అందించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అంజి యాదవ్‌, బాబా, షఫ్యున్‌, భూపాల్‌ రెడ్డి, ప్రేమ్‌ కుమార్‌, శ్రీకర్‌, జబ్బర్‌, వర్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.