ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయొద్దు – దీప‌క్ జాన్‌, అర‌వింద్ కుమార యాద‌వ్‌

హైద‌రాబాద్‌, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ ( మైనారిటీస్ ) ఫైనాన్స్ కార్పొరేషన్ దీపక్‌ జాన్‌, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్‌ కుమార్‌ యాదవ్ లు సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్‌లోని లంబాడి తండా బస్తీ కమ్యూనిటీ హాల్‌లో...