వ‌ర్షాలు, విద్యుత్ అంత‌రాయంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతుంటే ప‌ట్టించుకోరా ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :   నగరంలో భారీవర్షాల వల్ల రోడ్లు, చెట్లు కూలి, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం కలిగి జనజీవనం అస్తవ్యస్తమ‌వుతుంటే ప్ర‌భుత్వం కానీ, జిహెచ్ఎంసి అధికారులు ప‌ట్టించుకోరా అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... వర్షాకాలం ప్రారంభంలోనే ఈ వర్షాల వల్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న 3 నెల‌ల వర్షాకాలం నుంచి ప్రజలను రక్షించేది ఎవరనేది ప్రశ్నార్థకం అని...