Addam News
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 10:14 am Posted by : Addam News

టిజిఎస్ ఆర్టీసీ నూతన వైస్ చైర్మ‌న్‌, ఎండిగా డాక్ట‌ర్.అనిల్ కుమార్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైద‌రాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :

టీజీఎస్ ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ సంస్థ ప్రస్తుత పరిస్థితి, సంస్థ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన, సంస్థను మరింత బలోపేతం చేసే చర్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో అభిప్రాయాలను పంచుకున్నారు.