Addam News
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 1:08 pm Posted by : Addam News

బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా డాక్ట‌ర్.బూర న‌ర్స‌య్య గౌడ్‌

బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా డాక్ట‌ర్.బూర న‌ర్స‌య్య గౌడ్‌

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 09, అద్దం న్యూస్ :    భారతీయ జనతా పార్టీ తెలంగాణరాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా డాక్ట‌ర్.బూర న‌ర్స‌య్య గౌడ్ నియమితులయ్యారు. ఆయ‌న‌ నియమాకాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్రరావు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా బూర న‌ర్స‌య్య‌గౌడ్‌ మాట్లాడుతూ… పార్టీ పటిష్టత కోసం అంకితభవంతో అందిస్తున్న సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయ‌న‌ చెప్పారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png