Addam News
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 9:32 pm Posted by : Addam News

ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా డాక్ట‌ర్‌.దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నిక‌

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా డాక్ట‌ర్‌.దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రవణ్ దాసోజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన దాసోజు శ్ర‌వ‌ణ్‌కు గ‌తంలో కూడా ఎమ్మెల్సి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి ఆగిపోయింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఎమ్మెల్సి రావ‌డంతో ఆయ‌న‌కు ఉద్య‌మ‌కారులు అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నారు.

Whatsapp image 2025 03 13 akt 21.0ss4.06

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png