పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మణా చారి పోటీ
అంబర్‌పేట, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) : యువకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజల అభీష్టం మేరకే హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు ప్రముఖ సంఘ సేవకులు, ప్రేరణ బాలలవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి తెలిపారు. నాలుగు దశాబ్దాల కాలంలో ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా, ఉపాధ్యాయునిగా పని చేసి సుదీర్ఘ అనుభవం గడించిన లక్ష్మణాచారి మాట్లాడుతూ... విద్య, ఉపాధి రంగ సమస్యల పై...